జీహెచ్‌ఎంసీ ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన వారికి ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24 న నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల శిక్షణకు హాజరుకాని ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు తాఖీదులిచ్చారు. ఈ నెల 24న శిక్షణకు హాజరుకాని ఉద్యోగులకు నేడు మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నికల శిక్షణకు హాజరు కానివారు తమకు కేటాయించిన శిక్షణా కేంద్రంలో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
