కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలు కార్మిక సంఘాలు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సులభతర వాణిజ్యానికి అవకాశాలంటూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతోందని, ఫలితంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని కార్మిక సంఘాలు సమ్మె ప్రకటించాయి.
