ఏసీబీ వలలో ఇరిగేషన్‌ డీఈ మోహన్‌గాందీ

అవినీతి నిరోధక శాఖ వలకు ఇరిగేషన్‌ శాఖ డీఈ చిక్కాడు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ మహిళ నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నెలలో చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(సీబీఆర్‌) ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. అందులో భాగంగా ముదిగుబ్బ మండలం రాఘవపల్లిలో కంచం లీలావతికి చెందిన ఇంటికి ఇరిగేషన్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా రూ. 21 లక్షలు మంజూరు చేసింది. ఈ క్రమంలో పార్నపల్లి సబ్‌ డివిజన్‌ డీఈ మోహన్‌గాందీ(సీబీఆర్‌) లీలావతిని రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని కోరాడు. లీలావతి ఖాతాలో నష్టపరిహారం జమ కాగానే.. లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఈ నెల 25న ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన తిరుపతి ఏసీబీ డీఎస్పీ, అనంతపురం ఇన్‌చార్జ్‌ డీఎస్పీ అల్లాబ„Š  బృందం.. శుక్రవారం ఉదయం రెడ్‌హ్యాండెడ్‌గా డీఈని పట్టుకున్నారు.