ఖమ్మం జిల్లాలో అధిక ధరలకు మద్యం అమ్ముతున్న మూడు వైన్ షాపులను అధికారులు సీజ్ చేశారు. జిల్లాలోని కారేపల్లిలో ఉన్న మద్యం దుకాణాల్లో సూపరింటెండెంట్ సోమిరెడ్డి నేతృత్వంలో ఆబ్కారీ అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. మద్యం సీసాలపై ఉన్నదానికంటే అధిక ధరలకు వైన్ అమ్ముతున్నారని తేలడంతో మూడు మద్యం దుకాణాలను సీజ్ చేశారు. ఒక్కో మద్యం దుకాణానికి రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించారు. అదేవిధంగా మూడు వైన్ షాపులను పదిహేను రోజులపాటు సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
