ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నగరాల పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని హకీంపేట్ ఎయిర్‌బేస్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా భారత్ బయోటెక్‌కు బయలుదేరారు. భారత్ బయోటెక్‌లో వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై సందర్శించనున్నారు. మోదీ రాక సందర్భంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ.. నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడి జైడస్ బయోటెక్ పార్క్ సందర్శించారు. ఈ కార్యక్రమం అనంతరం అహ్మదాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్ పయనమయ్యారు. హైదరాబాద్ పర్యటన అనంతరం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌కు చేరుకుంటారు.
