ఏపీలో కొత్తగా 685 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 685 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 868749కు చేరింది.  ప్రస్తుతం 7427 యాక్టివ్‌ కేసులున్నాయి.  ఇప్పటి వరకు 854326 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.  ఒక్కరోజు వ్యవధిలోనే మరో నలుగురు మృతిచెందారు. ఇప్పటి వరకు  కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య  6996కు పెరిగింది.   ఇవాళ్టి వరకు 1,01,09,708 శాంపిల్స్‌ను పరీక్షించారు.