జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కోవిడ్ బాధితులతో పాటు సాధారణ ఓటర్లకు కూడా అవకాశం కల్పించారు. ఓల్డ్ మలక్పేట్లో గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ రద్దు చేశారు. ఎల్లుండి ఓల్డ్ మలక్పేట్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు. గ్రేటర్ పరిధిలోని 149 డివిజన్లలో పోలింగ్ ముగియగా ఈనెల 4న ఓట్లు లెక్కించనున్నారు.
పోలింగ్ ముగిసిన తరువాత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకున్నది. 149 డివిజన్లలో కొన్ని స్థానాల్లో మాత్రమే పోలింగ్ 50 శాతం దాటింది. కొన్ని చోట్ల కనీసం పోలింగ్ 15 శాతం కూడా చేరకపోవడం గమనార్హం.