తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రశంసలు కురిపించారు. నగరంలోని తారమతి బారాదరిలో తెలంగాణ స్టేట్‌ డెమొక్రసీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలు రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల నిర్వహణ అంత సులువు కాదన్నారు. స్థానిక సంస్థల్లో పోలింగ్‌ శాతం ఎక్కువగా నమోదవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సమర్థవంతంగా నిర్వహించిందన్నారు. ఇందుకుగాను తెలంగాణ ఎన్నికల సంఘాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.