కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కర్ణాటకకు చెందిన బీవీ శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీనివాస్‌ను పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పూర్తి స్థాయిలో నియమించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. 40 ఏండ్ల శ్రీనివాస్ స్వగ్రామం కర్ణాటకలోని షిమోగా జిల్లా భద్రావతి.
