ఏపీలో గత రెండురోజులతో పోలిస్తే ఇవాళ కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 663 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,159 మంది కోలుకొని డిశ్చార్జికాగా ఏడుగురు చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,69,412కు చేరింది.
