జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో రీపోలింగ్ ప్రారంభమ య్యింది. ఈ డివిజన్లో ఈ నెల 1న పోలింగ్ జరిగినప్పటికీ, అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలింగ్‌ను వాయిదా వేసింది. దీంతో ఇవాళ మరోమారు పోలింగ్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ డివిజన్‌తో పాటు గ్రేటర్‌లోని 149 డివిజన్ల ఓట్లను రేపు లెక్కించనున్నారు.
