పోలీసు అధికారులపై సస్పెన్షన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఖండించారు. అది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఇలా తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ఒకేరోజు 92 మంది పోలీసు అధికారుల సస్పెన్షన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారిని చెప్పారు. ఒకే రోజు 92 మంది పోలీసులుపై సీపీ చర్యలు తీసుకున్నారనే ప్రచారం అవాస్తవమని తెలిపారు.
