
సంక్రాంతి పండుగ సందర్భంగా నేషనల్ హైవే టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జమ్ ఏర్పడుతుంది. సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో హైదరాబాద్ నగర వాసులు తెలంగాణలోని మిగతా జిల్లాలకు మరియు ఏపీకి బయల్దేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. తెలంగాణ, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికి నల్గొండ జిల్లా నకిరేకల్ దగ్గర గల కొర్లపాడు టోల్‌గేట్‌లోని 8 టోల్ బూతులు తెరిచారు. ఒక బూత్‌లో ఫాస్ట్ ట్యాగ్ స్కానర్ పనిచేయకపోవడంతో పాత రేట్ల ప్రకారం డబ్బులు తీసుకొని వాహనాలను పంపుతున్నారు. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ వద్ద రహదారులు అన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్, విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్ధీ మరింత పెరిగింది. కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరడంతో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు.