జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా టీఆర్ఎస్కే పట్టం కట్టాయి. ఇప్పటి వరకూ వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌లో అధికారి పార్టీ టీఆర్ఎస్ దే హవా కనిపిస్తుంది. గతంలో కంటే టీఆర్ఎస్ పార్టీకి సీట్లు తగ్గుతున్నా కూడా.. టీఆర్ఎస్ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓట్ల శాతం మెరుగ్గా ఉన్నా సీట్లు సంపాదించే విషయంలో బీజేపీ వెనకబడే ఛాన్స్ ఉంది. ఇక మజ్లిస్ పార్టీ 40 కంటే ఎక్కువ సీట్లలో గెలవనుంది.
కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉంది. ‘పీపుల్స్ పల్స్’ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల ప్రకారం.. టీఆర్ఎస్కు 68-78 స్థానాలు, బీజేపీకి 25-35, ఎంఐఎంకు 38-42 స్థానాలు, కాంగ్రెస్‌కు 1-5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. ప్లస్ ఆర్ మైనస్ మూడు శాతం. టీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ (76)కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం టీఆర్ఎస్, బీజేపీకి మధ్య 6 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సైలెంట్ వేవ్ కన్పిస్తోంది. ఈ వేవ్ పనిచేస్తే బీజేపీ మరింత లాభపడే అవకాశం ఉంది.
మలక్‌పేట్ డివిజన్లో రీ పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెల్లడి అయ్యాయి.
థర్డ్ విజన్ సర్వే ప్రకారం.. టీఆర్ఎస్ పార్టీకి 95-101 డివిజన్లలో గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. ఎంఐఎం 35-38, బీజేపీ 5-12, కాంగ్రెస్ 0-1 సీట్లు సాధించే అవకాశం ఉంది.
సీపీఎస్ సర్వే ప్రకారం.. టీఆర్ఎస్ కు 82 -96, బీజేపీ 12-20, ఎంఐఎం 32-38, కాంగ్రెస్ 3-5 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది.
ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. టీఆర్ఎస్కు 78(+/-7), బీజేపీ 28(+/-5), మజ్లిస్ పార్టీ 41(+/-5), కాంగ్రెస్ 3(+/-3) స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది.
టీఆర్ఎస్ కు 40.08 శాతం(+/-3%), బీజేపీ 31.21 శాతం(+/-3%), మజ్లిస్ పార్టీ 13.43 శాతం(+/-3%), కాంగ్రెస్ 8.58 శాతం(+/-3%), ఇతరులకు 7.70 శాతం(+/-3%) ఓట్లు పోలైనట్లు అంచనా వేసింది.
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం.. టీఆర్ఎస్ 68 -78, బీజేపీ 25-35, ఎంఐఎం 38-42, కాంగ్రెస్ 1-5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది.
డిసెంబర్ 1న జరిగిన ఎన్నికల్లో 149 డివిజన్లలో 34,50,331 మంది అనగా 46.55 శాతం పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 15,90,291 (46.09 శాతం) కాగా, పురుషులు 18,60,040 (53.91 శాతం) ఉన్నారు. అత్యధికంగా రామచంద్రాపురం డివిజన్లో 67.71 శాతం పోలింగు నమోదు కాగా… అత్యల్పంగా యూసుఫ్‌గూడ డివిజన్లో 32.99 శాతం పోలింగు జరిగింది. సర్కిళ్లవారీగా రామచంద్రాపురం పరిధిలోనే అత్యధికంగా 65.09 శాతం పోలింగ్ జరుగగా.. రెండో స్థానంలో గాజులరామారం (53.65 శాతం), మూడోస్థానంలో చాంద్రాయణగుట్ట (53.07 శాతం) ఉన్నాయి.