గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ కొనసాగుతుంది. సైబరాబాద్ పరిధిలోని పలు కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను ఇతర సీనియర్ పోలీసు అధికారులతో కలిసి సీపీ సజ్జనార్ పర్యవేక్షించారు. మియాపూర్లోని సెంటియా స్కూల్ వద్ద భద్రతా పర్యవేక్షణ అనంతరం సీపీ మాట్లాడుతూ.. కౌంటింగ్ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో 7 వేల మంది సిబ్బందితో బందోబస్తు చేపట్టినట్లు తెలిపారు. ఫలితాల వెల్లడి తర్వాత 48 గంటల వరకు ఎలాంటి ర్యాలీలకు అమనుతి లేదన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
