జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం

గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు. మ‌రో 33 డివిజ‌న్ల‌లో టీఆర్ఎస్ ముందంజ‌లో ఉంది. యూసుఫ్‌గూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌యం సాధించ‌డంతో.. గులాబీ శ్రేణుల్లో సంబురాల్లో మునిగిపోయారు.