రేపు ఏలూరు బాధితులను పరామర్శించనున్నఏపీ సీఎం

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నది. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లనున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి జగన్ బయలుదేరనున్నారు. ఉదయం 10:20 గంటలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తర్వాత స్థానిక జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం అవుతారు. ఈ ఘటనపై జగన్‌ ఈరోజు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలన్నారు.