నల్లగొండ జిల్లా హాలియాకు డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ

నల్లగొండ జిల్లా హాలియాలో గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హాలియాకు డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ నిన్న ప్రకటించారు. డిగ్రీ కాలేజీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీచేసింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. త్వరలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.