ఏపీలో కొత్తగా 520 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కొత్తగా 520 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 519 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,74,515కు చేరింది. 8,62,230 మంది కోలుకున్నారు. మరో 5236 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఇవాళ్టివరకు 7049 మంది చనిపోయారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 64,425 మందికి కొవిడ్‌-19 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,06,99,622 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.