టీఎస్‌పీఎస్సీ తాత్కాలిక చైర్మన్‌గా.. ఇప్పటివరకు కమిషన్ సభ్యుడిగా ఉన్న డీ కృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి కాలానికి చైర్మన్ ఎంపిక అయ్యే వరకు కృష్ణారెడ్డి ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. నాంపల్లిలోని ప్రతిభా భవన్‌లో గురువారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సీ విఠల్, మహ్మద్ ఎం ఖాద్రీ, బీ చంద్రావతిల పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన విషయం విదితమే.
