విశాఖ స్టీల్ ప్లాంటులో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్-2 ద్రవ రూప ఉక్కును ఉంచిన లాడిల్ జారిపడటంతో ప్రమాదం సంభవించింది. లాడిల్ జారిపడిన ప్రదేశంలో ఆయిల్ ఉండటంతో ఒక్క ఉదుటున మంటలు వ్యాపించాయి. దీంతో ఆ ప్రదేశంలో పనిచేస్తున్నఇద్దరికి గాయలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్టీల్ ప్లాంట్ అధికారులు తెలిపారు.
