జాతీయ పశువైద్య మండలి సభ్యుడిగా లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధకశాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డికి అరుదైన గౌరవం  లభించింది. జాతీయ పశువైద్యమండలిలో సభ్యునిగా నియమిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్రం శనివారం గెజిట్‌ జారీ చేసింది. మూడేండ్లపాటు లక్ష్మారెడ్డి మండలిలో సభ్యుడిగా కొనసాగనున్నారు.