కోతుల పునరావాస కేంద్రాన్ని ప్రారంభించిన అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్ పట్టణంలోని గండి రామన్న హరితవనంలో రూ.2.25  కోట్లతో నిర్మించిన కోతుల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన చైన్ లింక్, సఫారీ, గజీబో, ఎకో హట్స్, చిన్న పిల్లల కోసం బోటింగ్, మూషిక జింకల పార్కును మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.