ఏపీ సీఎం జగన్‌కి ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు,  వైఎస్సార్‌ సీపీ నేతలు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.