గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వరంగల్ జిల్లా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వరంగల్ జిల్లా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వరంగల్ ఆర్ ఈ సీ ఏరియా లోని తార గార్డెన్ లో 3 మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ నా మిత్రులు రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టారని, ఇంతకుముందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పది వేల మొక్కలు నాటాను అని, కానీ సంతోష్ కుమార్ లక్ష్యం పది కోట్ల మొక్కలు నాటే వరకు నా వంతుగా ఎక్కడ కార్యక్రమం జరిగిన మొక్కలు నాటుతానని తెలిపారు. కేసీఆర్ హరితహారం లో బాగంగా అడవులు పెంచడం వల్ల దేశానికి ఆదర్శంగా ఉంది అని, దీని వల్ల భవిష్యత్ తరాలకు చక్కటి ఆక్సిజన్ అందుతుంది అని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదే విధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ ని , వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ని , వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ ని కూడా ఈ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.