బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం 1,89,036 చెట్లను తొలగించామని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారులు బదులిచ్చారు. ప్రత్యామ్నాయంగా 2.70 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పరిధిలో ఉన్న బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ఢిల్లీతో మెరుగైన అనుసంధానం కోసం ఎక్స్‌ప్రెస్‌వే చేపట్టారు.
