వృక్షవేదం పుస్తకం అద్భుతంగా ఉందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్‌ను అభినందించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు ఎంపీ సంతోశ్ కుమార్ వృక్షవేదం పుస్తకాన్ని అందజేశారు. పుస్తకాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్ చాలా బాగుందని ప్రశంసించారు. తాను ఏ పని చేసినా తన సోదర సమానుడు, మంత్రి కేటీఆర్ తన వెన్నంటి ఉండి ప్రోత్సహించడం చాలా ప్రత్యేకమని ఈ సందర్భంగా సంతోశ్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా కార్యక్రమం ఇలాగే సుదీర్ఘ కాలం కొనసాగాలని ఆకాంక్షించారు.