బీజేపీ తాజా కార్పొరేటర్, ఎల్‌బీనగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల రమేశ్‌గౌడ్ కరోనాతో సాయంత్రం కన్నుమూశారు. గతనెలలో జరిగిన ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి విజయం సాధించారు. ఎన్నికల అనంతరం కరోనా సోకగా కొత్తపేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అప్పటికీ నయం కాకపోవడంతో గచ్చిబౌలిలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తులు, గుండె సంబంధ సమస్య తీవ్రం కావడంతో తుదిశ్వాస విడిచారు.
