దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో దేశం పురోగతిలో ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నట్లు రాష్ర్టపతి పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు తెస్తుందని ఆశిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.
