కరోనాతో ఏపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు.గత నెల 13న కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. చల్లా రామకృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కుటంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి మృతిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కర్నూలు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వేసిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ భ్యులకు సానుభూతి తెలిపారు.
