సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝలుపించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న పదకొండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆరు ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది పట్టుకున్నారు. అదేవిధంగా గట్లపల్లి శివారులో నాలుగు ట్రాక్టర్లు, వెంకటాపూర్‌లో ఒక ట్రాక్టర్‌ను ఆర్టీవో శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ జయంత్ సీజ్ చేశారు. ఈ పదకొండు ట్రాక్టర్లను సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయానికి తలించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదుచేస్తామని అధికారులు తెలిపారు.
