చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి కొత్త పాలకవర్గం

చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బొడ్డు శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వైస్‌ చైర్మన్‌గా నేలపట్లకు చెందిన కప్పల శ్రీనివాస్‌గౌడ్‌, కార్యవర్గ సభ్యులుగా పి. సుధాకర్‌రెడ్డి, కొండె శ్రీశైలం, చింతకింది వెంకటేశం, జక్కడి సుమిత్ర, ఎండి చాంద్‌పాషా, సుర్కంటి నవీన్‌రెడ్డి, మంచికంటి భాస్కర్‌, నాంపల్లి అంజయ్య, సింగిల్‌విండో చైర్మన్‌, మున్సిపల్‌ చైర్మన్‌,  జిల్లా మార్కెటింగ్‌ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారులు కూడా సభ్యులుగా నియమితులయ్యారు.