ఏపీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన విశాఖ శ్రీ శారదా పీఠం స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతులు స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై ద‌ర్యాప్తును వేగ‌వంతం చేయాల్సిందిగా సీఎంను కోరారు. అనంత‌రం స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. దేవాలయాల భద్రతపై సీఎంతో మాట్లాడా. దాడులపై దర్యాప్తును వేగవంతం చేయాలని కోరాం. స్వరూపానంద స్వామివారు ఇచ్చిన సూచనలను కూడా సీఎంకు నివేదించాం. ప్రైవేటు ఆలయాల కమిటీలను సైతం దేవాదాయశాఖ, పోలీసులు సమన్వయం చేసుకోవాల్సిందిగా సూచించాం. పోలీస్‌ స్టేషన్‌ల వారీగా ఆలయాలపై దృష్టిపెట్టాలని సూచించాం.