మై హోం మైనింగ్ పై ప్రజాభిప్రేయ సేకరణలో ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు-వేపల మాధవరం గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. 631 ఎకరాల్లో మైహోం ఇండస్ట్రీస్ మైనింగ్ లీజ్ కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో బాధితులు ఆందోళకు దిగారు. ప్రజాభిప్రాయ సేకరణకు హాజరుకాకుండా బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్థానికులు, పోలీసులకు మధ్య వాగ్వాదం,తోపులాట జరగడంతో ఓ మహిళ ఎస్ఐ కిందపడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతులను అరెస్ట్ చేసి హుజుర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

631 ఎకరాల్లో మైనింగ్ విస్తరించడాన్ని  రైతులు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను నిరసిస్తూ ఇవాళ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పాస్ బుక్కులు రాకుండా అడ్డుకుంటున్నారని రైతులు అంటున్నారు.ఆరేళ్లుగా రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పాస్ బుక్ లు ఇవ్వకుండా ..భూములు లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీల వాళ్లు గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.