రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. కొద్ది రోజులుగా బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఈ ఛాలెంజ్‌ని స్వీకరిస్తూ మొక్కలు నాటుతూ వస్తున్నారు. దేత్తడి హారిక ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి శంషాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటిన ప్రముఖ నటుడు నోయెల్ సేన్ ఈ ఛాలెంజ్‌ని బిగ్ బాస్ 4 రియాల్టీ షో లో నాతో పాటు పాల్గొన్న సుజాత, కుమార్ సాయి, దీప్తి సునైనా, నాగవల్లి, రమ్య బెహ్రా, దివి లను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నోయల్ ఛాలెంజ్‌ని స్వీకరించిన సుజాత మొక్కలు నాటింది. ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలంటూ పేర్కొంది.
