శ‌బ‌రిమ‌ల‌లో మ‌క‌ర‌జ్యోతి ద‌ర్శ‌నం

కేర‌ళ‌లోని అయ్య‌ప్ప స్వామి దేవాల‌య స‌మీపాన శ‌బ‌రిమ‌ల‌లో గురువారం సాయంత్రం 6.49 గంట‌ల‌కు మ‌క‌ర జ్యోతి రూపంలో అయ్య‌ప్ప స్వామి ద‌ర్శ‌నం ఇచ్చారు. అయ్య‌ప్ప దేవాల‌యానికి ఈశాన్య దిశ‌లో పొన్నాంబ‌ల‌మేడు కొండ‌ల్లో కాంతులీనుతూ మ‌క‌ర జ్యోతి ద‌ర్శ‌నం జ‌రిగింది. జ్యోతి ద‌ర్శ‌నంతో భ‌క్తులు పుల‌కించిపోయారు. మ‌క‌ర జ్యోతిని ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చిన భ‌క్తుల‌తో శ‌బ‌రిమ‌ల కొండ‌లు స్వామియే అయ్య‌ప్ప నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగాయి.  కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఈ ఏడాది ఐదువేల మంది భ‌క్తుల‌ను మాత్ర‌మే మ‌క‌ర‌జ్యోతి ద‌ర్శ‌నానికి అధికారులు అనుమ‌తినిచ్చారు.