ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల తుది జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 4,04,41,378 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,99,66,737, మహిళలు 2,04,71,506 మంది ఉన్నారు. ఇక 4,135 మంది  థర్డ్‌జెండర్లు, 66,844 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.