నిజామాబాద్ రేంజ్‌లో 17 మంది ఎస్‌ఐలు బదిలీ అయ్యారు. నిజామాబాద్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) పి. శివశంకర్ రెడ్డి 17 మంది పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలో ఈ బదిలీలు జరిగాయి. గురువారం రాత్రి బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్ రెండవ పట్టణ ఎస్‌ఐ పి.ప్రభాకర్ భీంగల్ పీఎస్‌కు, డి. శ్రీనివాస్ నిజామాబాద్ రెండవ పట్టణ పీఎస్‌కు బదిలీ అయ్యారు. భీంగల్ ఎస్‌ఐ కె. శ్రీధర్ రెడ్డి మెండోరా పీఎస్‌కు, మెండోరా ఎస్‌ఐ పి. సురేష్ మోర్తాడ్ పీఎస్‌కు, మోర్తాడ్ ఎస్‌ఐ ఎం.సంపత్‌కుమార్‌ను వీఆర్‌కు, వేల్పూరు ఎస్‌ఐ పి.శ్రీధర్ గౌడ్ కమ్మర్‌పల్లి పీఎస్‌కు, కమ్మర్‌పల్లి ఎస్‌ఐ ఎండీ ఆరీఫ్ ఎర్రగట్లకు, ఎర్రగట్ల ఎస్‌ఐ బి. హరిప్రసాద్ ముప్కల్‌కు.. ముప్కల్ ఎస్‌ఐ పి. రాఘవేంద్ర బాల్కొండకు, బాల్కొండ ఎస్‌ఐ టి. శ్రీహరి వీఆర్‌కు.. నారాయణఖేడ్ ఎస్‌ఐ కె. సందీప్ నిజామాబాద్ 4వ పట్టణ పీఎస్‌కు, నిజామాబాద్ 4వ పట్టణ ఎస్‌ఐ వీఆర్‌కు.. మెదక్ వీఆర్‌లో ఉన్న బి. సంతోష్‌కుమార్ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పీఎస్‌కు.. కొండాపూర్ ఎస్‌ఐ కె. రాజా వీఆర్‌కు.. ప్రస్తుతం కామారెడ్డి వీఆర్‌లో ఉన్న అహ్మద్ మొహినుద్దీన్ బికనూర్ పీఎస్ సెకండ్ ఎస్‌ఐగా.. రామారెడ్డి పీఎస్ ఎస్‌హెచ్‌వోగా ఉన్న కె. రాజాను మద్నూర్ ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
