గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ ఆలయ చైర్మన్‌గా మోదీ ఎన్నిక

గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ దేవాలయం పాలకమండలి చైర్మన్‌గా ప్రధాని మోదీ ఎన్నికయ్యారు. గతంలో ప్రధాని హోదాలో ఈ ఆలయానికి చైర్మన్‌గా మోరార్జీ దేశాయ్‌ మాత్రమే పనిచేశారు. మళ్లీ ఇప్పుడు అదే హోదాలో మోదీ ఎన్నికకావడం విశేషం. ఆలయ చైర్మన్‌గా పనిచేసిన గుజరాత్‌ మాజీ సీఎం కేశుభాయ్‌ పటేల్‌ ఇటీవల మరణించడంతో కొత్త చైర్మన్‌ ఎన్నిక అనివార్యమైంది.