సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ కోసం స్థల పరిశీలన

ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో నల్లగొండ జిల్లా హాలియాకు రానున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించేందుకు అనువైన ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మలిగిరెడ్డి లింగారెడ్డి, సీఐ వీరరాఘవులు సభ స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్‌ వద్ద స్థలాన్ని పరిశీలించారు. వీరి వెంట టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ నల్లగొండ సుధాకర్‌ తదితరులు ఉన్నారు.