నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు

నల్లగొండ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్దఅడిశ‌ర్లపల్లి మండలం అంగడిపేట వద్ద అదుపుత‌ప్పిన లారీ ఎదురుగా వ‌స్తున్న‌ ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. మృతులను చింతబావి గ్రామానికి చెందిన రోజువారీ కూలీలుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.