పిసిబి ఛైర్మన్, సభ్య కార్యదర్శి, సభ్యుల అర్హతలపై ఉత్తర్వులు

సుప్రీంకోర్టు, జాతీయ హరిత న్యాయస్థానం ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) ఛైర్మన్, సభ్యకార్యదర్శి, సభ్యుల నియామకానికి అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ఛైర్మన్ గా నియమితులయ్యే వ్యక్తికి పర్యావరణ పరిరక్షణపై అవగాహన, క్షేత్రస్థాయి, వివిధ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలని పేర్కొంది. సభ్య కార్యదర్శికి పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన శాస్త్రీయ, ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్ రంగాల్లో విద్యార్హతలు, విజ్ఞానం, అనుభవం ఉండాలి. సభ్యుల పదవీకాలం మూడేళ్లు ఉండాలని స్పష్టం చేసింది.