బెస్ట్‌ ఎలక్టోరల్‌ అధికారిగా నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి

నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి రాష్ట్రస్థాయిలో బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డు -2020కు ఎంపికయ్యారు. ఎంపిక చేసిన జాబితాను చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ శనివారం విడుదల చేశారు. రాష్ట్రస్థాయిలో ముగ్గురు అధికారులను ఎంపిక చేయగా.. అందులో కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒకరు. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అవార్డును అందుకోనున్నారు. నిజామాబాద్‌ జిల్లాకేంద్రానికి చెందిన ఖనీజ్‌ ఫాతిమా బెస్ట్‌ బీఎల్‌వో (బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌) ఎంపికయ్యారు.