నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌ను సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా త్వరలో ఆయన మెడల్‌ అందుకోనున్నారు. 1990లో డీఎస్పీగా విధుల్లో చేరిన శివశంకర్‌రెడ్డి ఇటీవలే నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీగా ఉద్యోగోన్నతి పొందారు. 2002లో కఠిన సేవాపతకం, 2007లో ఉత్తమ సేవా పతకం, 2014లో అంతరిక్‌ సేవా పతకం, ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ అందుకున్నారు.