కార్తీకదీపం డైలీ సీరియల్ ఫేమ్ బేబీ కృతిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. ఆర్టిస్టు ప్రత్యూష చాలెంజ్‌ను స్వీకరించిన కృతిక నార్సింగి సమీపంలోని మంచిరేవుల వద్ద గురువారం మొక్కలు నాటింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తనను భాగస్వామ్యం చేసినందుకుగాను టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపింది. మొక్కలు నాటడం భూమిపై ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కృతికతో పాటు ప్రేమి విశ్వనాథ్(వంటలక్క), డాక్టర్ బాబు నిరూపమ్, ప్రొడ్యుసర్ వెంకటేశ్వర రావు గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన బేబీ కృతికకు ఎంపీ సంతోస్‌కుమార్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తన భాగస్వామ్యం ఇతర యువతకు స్ఫూర్తిని కలిగిస్తుందని పేర్కొన్నారు.