రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ నిరాటంకంగా కొనసాగుతున్నది. సావాళ్లను అందుకున్న ప్రముఖులతోపాటు, సామాన్యులు కూడా మొక్కలు నాటుతున్నారు. ఇందులో భాగంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాశ్ విసిరిన చాలెంజ్‌ను ప్రముఖ దర్శకుడు, నటుడు, గాయకుడు, నిర్మాత ఎం శశికుమార్ స్వీకరించారు. చెన్నైలోని తన నివాసంలో ఆయన మొక్కలు నాటారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని చెప్పారు. వాటిని సంరక్షించడం మన బాధ్యత అని అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్‌ను ఆదర్శంగా తీసుకుని తాను మొక్కను నాటానని వెల్లడించారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని, దీనికోసం తాను నటుడు సముద్రఖని, నటి నిఖిల్ విమల్, నటి అంజలిని గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నాని చెప్పారు. వారు కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చాడు.
