గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన బుల్లితెర నటి హర్షితా వెంకటేశ్‌

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం స్ఫూర్తిదాయంగా కొనసాగుతున్నది. పలురంగాల ప్రముఖులు, సినీతారలు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను చాటుతున్నారు. ఇవాళ బుల్లితెర నటి హర్షితా వెంకటేశ్ జూబ్లీహిల్స్‌ పార్కులో మొక్కలు నాటింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నటుడు ప్రీతమ్ విసిరిన చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినట్లు తెలిపారు.

భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.  మొక్కల సంరక్షణను సామాజిక బాధ్యతగా చూడాలని పిలుపునిచ్చారు. తాను మనీష్, రష్మీ ,మైతిలీలకు ఈ చాలెంజ్ విసురుతున్నట్లు చెప్పారు.  ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు హర్షితా వెంకటేశ్‌ ధన్యవాదాలు తెలిపారు.