గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన వరద కృష్ణ దాస్ ప్రభు (ఇస్కాన్ ఆలయ అధ్యక్షుడు, అబిడ్స్)

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన వరద కృష్ణ దాస్ ప్రభు (ఇస్కాన్ ఆలయ అధ్యక్షుడు, అబిడ్స్), శ్రీవాస్ రాస్భరి దాస్ ప్రభు (ఇస్కాన్ ఆలయంలో సమన్వయకర్త, అబిడ్స్)
ఈ సందర్భంగా వరద కృష్ణ దాస్ ప్రభు (ఇస్కాన్ ఆలయ అధ్యక్షుడు, అబిడ్స్) మాట్లాడుతూ గ్రీన్ ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమంను చేపట్టిన శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ వంతుగా మూడు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు. పాడవుతున్న పర్యావరణాన్ని విరివిగా మొక్కలను నాటి కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.