తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని బోయిన్‌పల్లి మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసైకి వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి స్వాగతం పలికారు. విద్యుత్, బయోగ్యాస్ ప్లాంట్ పనితీరును పరిశీలించిన గవర్నర్ తమిళిసై.. ఆ ప్రాంతమంతా కలియతిరిగారు. పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న కూరగాయల రైతులతో గవర్నర్ తమిళిసై మాట్లాడారు.
