ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా, శ్రద్ధ తీసుకునేందుకు ఈ క్యాన్సర్ దినోత్సవం రోజున ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. బలమైన సంకల్పంతో, సకాలంలో రోగ నిర్ధారణ, సమర్థవంతమైన వైద్య సంరక్షణతో క్యాన్సర్‌ను ఓడించవచ్చు అని ఆమె పేర్కొన్నారు. క్యాన్సర్ నివారణ, రోగ నిర్ధారణ, చికిత్సను అందరం ప్రోత్సహిద్దామని కవిత పేర్కొన్నారు.
